” నా యాత్ర చాలా కాలం తీసుకుంటుంది. దాని మార్గమూ దూరమే. “
..నిజమే, ” అచ్చం నాకుమల్లెనే “. అయితే నాది గమ్యం లేని ప్రయాణం కాదు. గమ్యం తెలియని ప్రయాణం.
” రాత్రింబవళ్ళు గడుస్తాయి. పుష్పాలవలె యుగాలు వికసించి వాడిపోతాయి. “
” నా పడవ తెరచాపనెత్తాలి. సోమరి ఘడియలు వొడ్డునే గడిచిపోతున్నయి.. దురదృష్టం.
వసంతం పుష్పించటం ముగించుకుని శెలవు తీసుకుంది. వ్యర్థమైన పువ్వుల భారంతో నేను తాత్సారం చేస్తూ నిలిచిపోయాను. ” .. నేనే కదూ.. నిజమే!
” నన్నల్లుకున్న బంధాలు మొండివి.
కానీ వాటిని తెంచుకోవాలని ప్రయత్నిస్తే, నా హృదయం బాధిస్తుంది.
నాకు కావలసినదల్లా ‘ స్వేచ్ఛ ‘.
కానీ దానికోసం ఆశించడానికి కూడా నాకు సిగ్గవుతోంది. “
” నా రుణాలకంతం లేదు. నా లోపాలు బహుళం. “…
” పగలు నుంచి రాత్రి వరకు నా తలుపు వాకిట్లో ఇట్లా కూర్చుని వుంటాను. నా కళ్ళు తెరుచుకునే సంతోష సమయం అకస్మాత్తుగా వస్తుందని నాకు తెలుసు. “.. నేనూ ఆశాజీవినే.
” వైరాగ్యంలోంచి మోక్షం నాకవసరంలేదు. సహస్ర ఆనందబంధాలలో స్వతంత్రం నన్ను ఆలింగనం చేసుకుంటుంది. “
– రవీంద్రుని ‘ గీతాంజలి ‘ లో నాకు నచ్చిన ప్రతి వాక్యం నాగురించే చెబుతున్నట్టుంటే, అంతకంటే ఎం చెప్పాలో తెలియటంలా..


hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
andhra desam lo nuvvu oka sundhuram
‘గీతాంజలి ‘ మీకిష్టమా???
ఎక్కడో వ్రాసుకున్నాను… గీతాంజలిలోని ప్రతీ వాక్యం జీవితంలో, ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట.. జ్ఙ్నాపకానికి వస్తుందని…
ఎప్పుడూ అనుకుంటాను…
అద్బుతమైన పుస్తకాలు రెండని…
ఒకటి: భగవద్గీత – బ్రతకటం ఎందుకో చెప్పినందుకు…
రెండు: గీతాంజలి – ఎలా బ్రతకాలో చెప్పినందుకు…
బ్రతుకులో ఆనందం ఏమిటో, ఎలా వుంటుందో చెప్పినందుకు…
అసలు పై విషయాన్ని ఎవరికీ చెప్పగలనని అనుకోలేదు…
థాంక్స్… ‘గీతాంజలి ‘ని ఇష్టపడినందుకు…
Hello……..
vraayatam maanesaaraa? leaka ….
mareadainaanaa????
vraayandi…
kaneesam geetanjali meedaina….